Chhattisgarh Encounter| ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా తార్లగూడెం మరికెళ్ల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

విధాత: చత్తీస్ గఢ్ బీజాపూర్(Chhattisgarh Bijapur) జిల్లా తార్లగూడెం మరికెళ్ల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)లో మరో నలుగురు మావోయిస్టులు మృతి(Four Maoists Killed) చెందారు. తాళ్లగూడెం పోలీసుస్టేషన్‌ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్బంగా పరస్పరం ఎదురుపడిన మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురు కాల్పలు చోటుచేసుకున్నాయి..కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భీకర ఎదురు కాల్పులు సాగుతున్నాయని సమాచారం.

బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వచ్చే మార్చి 31నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా చత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది.