Clay Ganesh | ఉచితంగా లక్ష మట్టి గణేశ్‌ల పంపిణీ: మేయర్‌ విజయలక్ష్మి

కార్పొరేట్‌ సంస్థల ద్వారా మరో 3.10 లక్షల విగ్రహాలు సమీక్షలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి Clay Ganesh | హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలోని 20 ప్రదేశాలలో లక్ష మట్టి గణేశ్‌ ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. మరో 3.10 లక్షల మట్టి విగ్రహాలు కార్పొరేట్‌ సంస్థల ద్వారా ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని […]

  • Publish Date - September 6, 2023 / 01:38 PM IST

  • కార్పొరేట్‌ సంస్థల ద్వారా మరో 3.10 లక్షల విగ్రహాలు
  • సమీక్షలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

Clay Ganesh | హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలోని 20 ప్రదేశాలలో లక్ష మట్టి గణేశ్‌ ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. మరో 3.10 లక్షల మట్టి విగ్రహాలు కార్పొరేట్‌ సంస్థల ద్వారా ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీస్, హెచ్ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, మెట్రో, జలమండలి, హెల్త్, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విజయలక్ష్మి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సూచించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాటు చేస్తామని మేయర్‌ తెలిపారు.

హెచ్ఎండీఏ ద్వారా స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్లు గత ఏడాది కంటే ఎక్కువ‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 7 ప్లాట్ ఫాంలు, ట్యాంక్‌బండ్‌ వద్ద 14, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, బుద్ధ భవన్ వైపు 7 ప్లాట్ ఫాంలు, హెలిప్యాడ్, సంజీవయ్య పార్కు బేబీ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10,500 శానిటేషన్ కార్మికులు మూడు షిఫ్ట్ లుగా ఏర్పడి, నిమజ్జనం సందర్భంగా గౌరవ‌ ప్రదంగా విగ్రహాలు తొలగింపుకోసం ప‌నిచేస్తార‌ని మేయ‌ర్ తెలిపారు. గణేష్ నిమజ్జనం కొరకు నగరంలో మొత్తం 74 నిమజ్జనం కొలనులను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Latest News