Medak | సిటింగులకు అసమ్మతి గజ్వేల్, సిద్దిపేట తప్ప…

Medak | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను, నర్సాపూర్ మినహా 9 స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. సిటింగ్ లందరూ వారి స్థానాలను పదిల పరచుకొగా, నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఈ టికెట్ కు పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ కూతురు కవిత కల్పించుకొని సునీతా లక్ష్మారెడ్డి […]

  • Publish Date - August 22, 2023 / 04:19 PM IST

Medak |

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను, నర్సాపూర్ మినహా 9 స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. సిటింగ్ లందరూ వారి స్థానాలను పదిల పరచుకొగా, నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు.

సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఈ టికెట్ కు పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ కూతురు కవిత కల్పించుకొని సునీతా లక్ష్మారెడ్డి కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకే నర్సాపూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మదన్ రెడ్డి కి టికెట్ కేటాయించకుండా పెండింగ్ లో పెట్టారు.

మెదక్ లో సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కి టికెట్ కేటాయించినా, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తనయుడు డాక్టర్ రోహిత్ వర్గాలతో అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మొదటి రోజు మైనంపల్లి వర్గం రాందా చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయగా, టికెట్ కేటాయించిన ఆనందం ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి వర్గం పార్టీ ప్రజా ప్రతినిధులు, సుమారు 500 మంది పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయింపుపై పున పరిశీలన చేయాలని లేకపోతే పార్టీ కి రాజీనామా చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

ఇదిలా ఉండగా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరువు, అందోల్ నారాయణ్ ఖేడ్ తదితర నియోజక వర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యే లకు అసమ్మతి సెగలు కక్కుతోంది. టికెట్ దక్కించుకున్న సిటింగ్ ఎమ్మెల్యేలకు 100 రోజుల సమయం కంటే ఎక్కువ ఉంటుంది. వారిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా దుబ్బాక నియోజక వర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి టికెట్ కేటాయించ గా, అక్కడ దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీ నుండి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి కొంత అనుకూలంగా ఉంది. మెదక్, దుబ్బాక టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు.

Latest News