Site icon vidhaatha

Medak: MN కెనాల్‌లో.. 3 నెలల బాలుని మృత దేహం లభ్యం

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశట్ పల్లి వద్ద గల ఏం ఎన్ కెనాల్ వద్ద 3 నెలల బాలుని శవాన్ని పోలీసులు కనుగొన్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.

మెదక్ రూరల్ సిఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలోని ఎం ఎన్ కెనాల్ కాలువలో సుమారు మూడు నెలల వయసున్న బాలుని మృతదేహం మంగళవారం ఉదయం లభించింది. బాలుని ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోగా మెడకు బట్టతో చుట్టి ఉరివేసి బట్టను నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకపోకుండా ఉండేలా కాలువలో బండరాయికి కట్టారు.

చనిపోయిన మృతదేహాన్ని కాలువలో పడేశారా.. లేక బతికున్న బాలున్నే కర్కషంగా ఉరివేసి చంపి కాలువలో వేశారా తెలియదు, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఇక ఈ సంఘటన గ్రామస్థులను, హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులను కంటతడి పెట్టిస్తుంది.

బాలుని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ విజయ్, కొల్చారం ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version