Site icon vidhaatha

బుట్ట‌లో కుమారుడి డెడ్‌బాడీతో.. పోస్టుమార్టం కోసం 14 కి.మీ. బైక్‌పై

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. ఓ నాలుగేండ్ల బాలుడు స‌జీవ‌ద‌హ‌నం అయ్యాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీనిలో ఓ బుట్ట‌లో వేసుకుని 14 కి.మీ. ప్ర‌యాణించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే అంబులెన్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ దిందోరి జిల్లాలోని భూర్కా గ్రామంలో బుధ‌వారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్నిప్ర‌మాదంలో నాలుగేండ్ల బాలుడు(మాన‌సిక విక‌లాంగుడు), రెండు పెంపుడు జంతువులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యాయి.

దీంతో కుమారుడు చంద‌న్ రాజ్ డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తీసుకెళ్లాల‌ని తండ్రి నిర్ణ‌యించాడు. అంబులెన్స్‌కు కాల్ చేయ‌గా అందుబాటులో లేద‌ని చెప్పారు. చేసేదేమీ లేక ఆ డెడ్‌బాడీని ఓ బుట్ట‌లో వేసుకుని ఆరెంజ్ క‌ల‌ర్ క్లాత్ చుట్టారు. అనంత‌రం 14 కిలోమీట‌ర్లు బైక్‌పై ప్ర‌యాణించి మెహంద్వాని ఆస్ప‌త్రికి చేరుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

Exit mobile version