Site icon vidhaatha

Medak | పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దు.. రాందాస్ చౌరస్తాలో రోహిత్ వర్గం నిరసన

Medak |

విధాత, మెదక్ బ్యూరో: ‘కేసీఆర్, కేటీర్ ముద్దు.. పద్మా దేవేందర్ రెడ్డి వద్దు. ఆమెకు మెదక్ టికెట్ కేటాయించొద్దు’ అని డాక్టర్ మైనంపల్లి రోహిత్ వర్గం డిమాండ్ చేస్తోంది.

ఆదివారం రోహిత్ వర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చిన్న శంకరంపెట్ సర్పంచ్ రాజీ రెడ్డి అధ్వర్యంలో మెదక్ రాందాస్ చౌరస్తాలో నిరసనకు దిగారు.

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె కార్యకర్తలను విస్మరించిందని, టికెట్ ఇవ్వద్దని సర్పంచ్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

నిరసనలో నాయకులు పర్శరాం గౌడ్, బొజ్జ పవన్, మేడి గణేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version