Medak | రామాయంపేట రెవెన్యు డివిజన్ తెచ్చే బాధ్యత నాదే: తిరుపతి రెడ్డి

Medak పద్మా దేవేందర్ రెడ్డి అసమర్ధతోనే రెవెన్యు డివిజన్ రావడం లేదు.. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో హామీ ఇప్పిస్తా… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రామాయంపేటలో భారీ నిరసన ర్యాలీ… కొనసాగుతున్న దీక్షలు.. విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అధ్వర్యంలో రామాయంపేట డివిజన్ సాధన సమితి జేఏసీ అధ్వర్యంలో […]

  • Publish Date - May 17, 2023 / 01:14 PM IST

Medak

  • పద్మా దేవేందర్ రెడ్డి అసమర్ధతోనే రెవెన్యు డివిజన్ రావడం లేదు..
  • పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో హామీ ఇప్పిస్తా…
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
  • రామాయంపేటలో భారీ నిరసన ర్యాలీ… కొనసాగుతున్న దీక్షలు..

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అధ్వర్యంలో రామాయంపేట డివిజన్ సాధన సమితి జేఏసీ అధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో 51రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించి దీక్ష లకు మద్దతు తెలిపారు.

ఇందిరాగాంధీ విగ్రహం నుండి బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో కోలాటాలు కళాకారులు, బోనాలు, డోలు చప్పుడు ఒగ్గు కళాకారులు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన రామయంపేటను అభివృద్ధి చేయడం పక్కన పెట్టి ఆస్తులు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే రెవెన్యు డివిజన్ అవ్వడంలేదని అన్నారు. వారం రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ కమిటీ సమక్షంలోనే రెవెన్యు డివిజన్ ఏర్పాటుపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో హామీ ఇప్పిస్తానని తిరుపతి రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పర్టీ అధికారంలోకి రాగానే 3 నెలల్లో రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేసే బాధ్యత తనే తీసుకుంటానని అన్నారు.

కార్యక్రమంలో వివిధ కుల సంఘాలు ఆర్యవైశ్య, రజక, వర్తక వాణిజ్య సంఘాలు. విశ్వకర్మ, హార్డ్వేర్ అసోసియేషన్, సాగర సంఘాలు, మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంఛాందర్ గౌడ్, మామిల్ల ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి చింతల యాదగిరి,శ్యామ్ రెడ్డి, రమేష్ రెడ్డి, రమణ, లింగం గౌడ్, ఆంజనేయులు గౌడ్, శంకర్, శ్రీనివాస్, అనిల్ రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు యాదగిరి, అనిల్ ,రమేష్ రెడ్డి, JAC నాయకులు దామోదర్పో, చమ్మ శ్రీనివాస్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్,అర్ వినయ్ సాగర్,నరేష్,దోమకొండ యాదగిరి, ఏ,అశోక్,వైఎస్ వేంకటీ, వివిధ సంఘాల నాయకులు ఇతరులు పాల్గొన్నారు.

Latest News