Site icon vidhaatha

Medak | ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం: మొహమ్మద్ హఫీజ్

Medak

విధాత, మెదక్ బ్యూరో: రైతు ఆత్మహత్యలపై స్పందన వ్యక్తం చేయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పదేళ్ల సంబరాల పేరిట గ్రామాల్లో డాన్సులు చేయడం సిగ్గుచేట‌ని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్ ఎద్దేవా చేశారు.

ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు నెలల వ్యవధిలోనే ఐదుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కనీసం తన స్పందన కూడా వ్యక్తం చేయలేదని ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ సంబరాల పేట గ్రామాల్లో బీఆర్ఎస్ చేస్తున్న యాగిని ఆపాలని డిమాండ్ చేశారు.

Exit mobile version