Virosh | టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా సైలెంట్‌గా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి వివాహంగా మార్చుకోబోతున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అద్భుతమైన రాజసిక నగరం ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే విజయ్, రష్మికల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయపూర్‌కు చేరుకున్నారు. రాజసంగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని సమాచారం. పెళ్లి అనంతరం మార్చ్ 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
ఈ సందర్భంగా గతంలో విజయ్ సినిమా ఈవెంట్‌లో ఆయన తల్లిదండ్రులు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో యాంకర్ సుమ, “మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలి?” అని ప్రశ్నించగా విజయ్ తల్లి మాధవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు కోడలు విషయంలో ఒకే ఒక్క కండిషన్ ఉంది. విజయ్‌ను చాలా ప్రేమగా చూసుకోవాలి. అతని పని, ఇండస్ట్రీ లైఫ్‌ను అర్థం చేసుకోవాలి,” అని ఆమె చెప్పడం అప్పట్లోనే అందరినీ ఆకట్టుకుంది. అదే ఈవెంట్‌లో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు మాట్లాడుతూ, “విజయ్‌కు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. మతం, కులం వంటి పట్టింపులు నాకు లేవు. కానీ ఇండియన్ మహిళనే పెళ్లి చేసుకోవాలి,” అని తెలిపారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం విజయ్ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగానే రష్మిక దొరికిందని అంటున్నారు. రష్మిక కూడా సినీ రంగానికి చెందినదే కావడంతో, విజయ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను బాగా అర్థం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్–రష్మికల ప్రేమకథ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఈ జంట ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా స్పందించలేదు. ఇప్పుడు పెళ్లి వేడుకతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడనుంది. ఉదయపూర్‌లో జరుగుతున్న ఈ రాయల్ వెడ్డింగ్ ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే #ViroshWedding వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
