Medak | రెడ్ క్రాస్ సేవలను మారుమూల గ్రామాలకు విస్తరించాలి: RDO సాయిరాం

Medak రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గా ఏ లేటి రాజశేఖర్ రెడ్డి.. నూతన కార్యవర్గం ఎన్నిక విధాత, మెదక్ బ్యూరో: రెడ్ క్రాస్ సేవలను ప్రతి గ్రామానికి విస్తరించేలా నూతన కార్యవర్గం పని చేయాలని ఆర్తులకు, వృద్దులకు సేవలు అందించాలని మెదక్ ఆర్.డి.ఓ. ఎన్నికల అధికారి పి.సాయిరాం అన్నారు. క్రమశిక్షణతో ప‌నిచేసే రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా స్థాయి నాయకులను ఏకగ్రీవంగా ఏన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువారం మెదక్ టి ఎన్ జి ఓ […]

  • Publish Date - May 17, 2023 / 11:53 PM IST

Medak

  • రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గా ఏ లేటి రాజశేఖర్ రెడ్డి..
  • నూతన కార్యవర్గం ఎన్నిక

విధాత, మెదక్ బ్యూరో: రెడ్ క్రాస్ సేవలను ప్రతి గ్రామానికి విస్తరించేలా నూతన కార్యవర్గం పని చేయాలని ఆర్తులకు, వృద్దులకు సేవలు అందించాలని మెదక్ ఆర్.డి.ఓ. ఎన్నికల అధికారి పి.సాయిరాం అన్నారు. క్రమశిక్షణతో ప‌నిచేసే రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా స్థాయి నాయకులను ఏకగ్రీవంగా ఏన్నుకోవడం
చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువారం మెదక్ టి ఎన్ జి ఓ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత మాసంలో మెదక్ రెడ్ క్రాస్ శాఖ వార్షిక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసుకుని, 18 మందిని మేనేజ్మెంట్ కమిటి లో సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, రెడ్ క్రాస్ ఎన్నికల నిబంధనల ను పాటించి, జిల్లా కలెక్టర్ శ్రీ‌రాజర్షి షా ఆదేశానుసారం గురువారం మెదక్ లోని టి.ఎన్. జి.ఓ భవన్ లో ఉదయం 11.30 గంటలకు జిల్లా చైర్మన్, వైస్ చైర్మన్, రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి పదవులను, అలాగే 13మందిని జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

వారికి రెడ్ క్రాస్ నియమాలను, సేవల విధానాలను, చదివి వినిపించి, నూతన సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. తాను కూడా రెడ్ క్రాస్ సేవలతో పాలు పంచుకుంటానని తెలిపారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ పక్షాన ఎన్నికల అధికారి, అడ్మిన్స్ట్రేటివ్ అధికారి జి. కోటిరెడ్డి శాఖ చేపడుతున్న సేవలను, రక్తదానం ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు సేవలను అందిస్తున్నామని, ఎన్నికల విధి, విధానాలను, చేయవలసిన సేవలను వివారించారు.

రాష్ట్ర జూనియర్, యూత్ రెడ్ క్రాస్ కో-ఆర్డినేటర్, రమేష్ మియ్యపురం మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ సభ్యులతో పాటు యూత్, జూనియర్ రెడ్ క్రాస్ వ‌లంటీర్లు కూడా సేవలను అందిస్తున్నారని, జిల్లాలోని స్కూళ్లలో, కళాశాలలో వీటిని స్థాపించాలని తెలిపారు. రాష్ట్ర పి.ఆర్.ఓ. ఓ.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్ క్రాస్ చాలా సంవత్సరాలగా వివిధ రంగాలలో సేవలను అందిస్తూ ఉందని తెలిపారు. రాష్ట్ర రక్తనిధి కేంద్రాల కమిటీ సభ్యులు సింగం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కొద్దీ రోజుల్లో మెదక్ శాఖ వివిధ సేవలకు శ్రీకారం చుడుతుందని, రక్తనిధి కేంద్ర స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం మూడు సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది.

క‌మిటీ ప్ర‌మాణ స్వీకారం

జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గా ఏలేటి రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా లయన్ పి.లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా సింగం శ్రీనివాస్ రావు, కోశాధికారి గా డి. జి.శ్రీనివాస్ శర్మ,ప్రధాన కార్యదర్శి గా టి.సుభాష్ చంద్ర బోస్ లు, అలాగే 13 మంది మేనేజ్మెంట్ సభ్యులు లయన్ దేమే యాదగిరి,
లయన్ వంగరి కైలాసం, SLLV ప్రసాద్, వి.దామోదర్ రావు వి.ప్రభురెడ్డి, మెట్టు యాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, డా౹౹ సి.గోవింద్, జలలొద్దిన్,మొహమ్మద్ నవాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన జిల్లా చైర్మన్ గా ఎన్నికైన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఆదేశానుసారం, సభ్యుల సహకారంతో పేదలకు, వృద్దులకు సేవలందిస్తానని ప్ర‌మాణం చేశారు. సభ్యులందరు ఏకగ్రీవంగా కార్యదర్శి, ఆర్థిక రిపోర్టులు ఆమోదించారు.

Latest News