Site icon vidhaatha

Medak | సింగూరు ప్రాజెక్టు కు జలకళ

Medak

విధాత, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిడుకుండలా మారింది. ఎగువన కర్ణాటకలో వర్షాలు లేక ఈ ప్రాజక్టు పూర్తి స్థాయిలో నీరు నిండలేదు.

ఐనప్పటికీ ప్రాజెక్టు లో ప్రస్తుతం 20,646 టీఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. మొత్తం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29,917 టీఎంసీలు కాగా, గత ఏడాది ఇదే నెలలో 3 టీఎంసీ ల నీరు ఎక్కువగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రాజక్టు ఇన్ ఫ్లో తగ్గింది. ఔట్ ఫ్లో 385 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయగా మంజీర నది పరవళ్ళు తొక్కింది. దీంతో మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లింది.

హల్దీ ప్రాజెక్టుకు జలకళ

జిల్లాలోని హాల్దీ ప్రాజెక్టు పొంగి పొరలడంతో పడుపోలేరు వాగు పొంగింది. బొల్లారం మత్తడి సైతం పొంగి పొరలింది.

Exit mobile version