Medak | రక్తదానం కంటే మించిన దానం మరొకటి లేదు: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

Medak సర్ధనలో విజయవంతమైన రక్తదాన శిబిరం విధాత, మెదక్ బ్యూరో: ఆపద సమయంలో ఒక రక్తదాత నలుగురి ప్రాణాలను కాపాడవచ్చునని, రక్తదానం అన్ని దానముల కన్నా ఉత్తమమని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని అన్నారు . శనివారం హవేలీ ఘనపూర్ మండలం లోని గ్రామపంచాయతీ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, సర్ధన సేవా సమితి ఆధ్వర్యంలో సర్ధన గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్పీ పాల్గొని యువతకు రక్తదానం వల్ల […]

  • Publish Date - July 8, 2023 / 12:18 PM IST

Medak

  • సర్ధనలో విజయవంతమైన రక్తదాన శిబిరం

విధాత, మెదక్ బ్యూరో: ఆపద సమయంలో ఒక రక్తదాత నలుగురి ప్రాణాలను కాపాడవచ్చునని, రక్తదానం అన్ని దానముల కన్నా ఉత్తమమని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని అన్నారు . శనివారం హవేలీ ఘనపూర్ మండలం లోని గ్రామపంచాయతీ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, సర్ధన సేవా సమితి ఆధ్వర్యంలో సర్ధన గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్పీ పాల్గొని యువతకు రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలు విస్తరింపజేయాలనీ సూచించారు. సర్ధన గ్రామంలో గ్రామ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ప్రోత్సహించారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాచైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరముల నుండి 55 సంవత్సరం ల వరకు, అలాగే 45 కేజీల పైన బరువు ఉన్న ప్రతి యువతీ, యువకులు కూడా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్ గారు యువతను ఒక తాటిపై నిలపడానికి కృషిచేసి రక్తదాన శిబిరానికి రూపకల్పన చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి. లక్ష్మణ్ యాదవ్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, మేనేజింగ్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి ,వంగరి కైలాసం పాల్గొని శిబిరంలో సేవలందించారు.

అలాగే ఈ కార్యక్రమాన్ని సర్దన సేవా సమితి గౌరవ అధ్యక్షులు,ఎస్. బాల్ కిషన్ రావు అలాగే కోశాధికారి కె. వెంకటేశం గ్రామ సర్పంచ్ సుభాష్ ,సర్దన సేవా సమితి సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొని యువతను రక్తదాన శిబిరానికి ప్రోత్సహించి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కృషి చేసారు.

Latest News