విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. స్వగ్రామంలోనే ఆయన జ్వరంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడారానికి చెందిన సమ్మక్క పూజారుల్లో సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు ఒకరు. పూజారి మృతితో స్థానికంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.