Meenakshi Chaudhary |
మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ హర్యానా అందం తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. అడివి శేష్ ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించగా, ఈ సినిమా హిట్ కావడంతో ముద్దుగుమ్మకి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
హిట్2 సినిమాలో మీనాక్షి ఆర్యా అనే పాత్రలో కనిపించి ఎంతగానో అలరించింది. ఇక మీనాక్షి వరుణ్ తేజ్ హీరోగా రూపొందనున్న కొత్త చిత్రంలోను ఎంపికైంది. ‘పలాస 1978’ చిత్ర దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో VT14 తెరకెక్కబోతుండగా, ఇందులో కథానాయికగా ఈ హర్యానా బ్యూటీనే ఎంపిక చేసినట్టు సమాచారం.
#MeenakshiChaudhary Latest video