విధాత: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natrajan)ను నియమిస్తూ ఏఐసీసీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పార్టీ అధికారిక ప్రకటనను సైతం విడుదల చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బిర్లాగ్రామ్ నాగ్దాలో జన్మించిన మీనాక్షి నటరాజన్ ఇండోర్ లోని దేవి అహిలియా విశ్వవిద్యాలయం నుంచి 1994లో బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే 2002లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
అనంతరం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షురాలిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. అదేవిధంగా.. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natrajan) “1857-భారతీయ పరిపేక్ష్, “అప్నే-అప్నే కురుక్షేత్ర” ఆమె రచించిన ప్రసిద్ధ నవలలు. ఆంతేకాదు సండే నవజీవన్‌కి క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తూ ఉంటుంది.