Microsoft | బాలుడి వ్య‌క్తిగ‌త స‌మాచారం.. సేక‌రించినందుకు మైక్రోసాఫ్ట్‌కు జ‌రిమానా

విధాత‌: ఆన్‌లైన్‌లో ఎక్స్ బాక్స్ అనే గేంను కొనుగోలు చేసిన బాలుడి స‌మాచారాన్ని సేక‌రించినందుకు దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) కు జ‌రిమానా ప‌డింది. సుమారు రూ.2 కోట్లు ( 2 మిలియ‌న్ డాల‌ర్స్‌) న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బాలల వ్య‌క్తిగ‌త గోప్య‌తకు ఇలాంటి విధానాలు చేటు చేస్తున్నాయ‌ని త‌న తీర్పులో పేర్కొంది. అయితే ఈ ఉత్త‌ర్వుల‌ను ఫెడ‌ర‌ల్ కోర్టు ఆమోదించాల్సి ఉంది. ఏం జ‌రిగింది? స‌ద‌రు బాలుడి […]

  • Publish Date - June 6, 2023 / 09:22 AM IST

విధాత‌: ఆన్‌లైన్‌లో ఎక్స్ బాక్స్ అనే గేంను కొనుగోలు చేసిన బాలుడి స‌మాచారాన్ని సేక‌రించినందుకు దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) కు జ‌రిమానా ప‌డింది. సుమారు రూ.2 కోట్లు ( 2 మిలియ‌న్ డాల‌ర్స్‌) న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బాలల వ్య‌క్తిగ‌త గోప్య‌తకు ఇలాంటి విధానాలు చేటు చేస్తున్నాయ‌ని త‌న తీర్పులో పేర్కొంది. అయితే ఈ ఉత్త‌ర్వుల‌ను ఫెడ‌ర‌ల్ కోర్టు ఆమోదించాల్సి ఉంది.

ఏం జ‌రిగింది?

స‌ద‌రు బాలుడి త‌ల్లిదండ్రుల అంగీకారం లేకుండా మైక్రోసాఫ్ట్ వారి డేటాను సేక‌రించింద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాకుండా 2021కి ముందు క్రియేట్ చేసిన వారి ఎకౌంట్ డేటాను అనుమతించిన స‌మ‌యం కంటే ఎక్కువ రోజులు త‌మ స‌ర్వ‌ర్ల‌లో ఉంచుకున్నార‌ని తెలుస్తోంది.

ఇది చిల్డ్ర‌న్స్ ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటెక్ష‌న్ యాక్ట్ ఉల్లంఘ‌న కిందే వ‌స్తుంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం మైన‌ర్ల త‌ల్లిదండ్రుల అనుమ‌తి లేకుండా వారి వ్య‌క్తిగ‌త డేటాను సేక‌రించ‌డం నిషిద్ధం. తాజా కేసులో బాలుడి వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించడ‌మే కాకుండా దానిని 2015 నుంచి 2020 వ‌ర‌కు త‌న ద‌గ్గ‌రే మైక్రోసాఫ్ట్ ఉంచుకుంది. అత‌డి తండ్రి ఈ విష‌యంపై సంప్ర‌దించినా ఫ‌లితం లేక‌పోయింద‌ని తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ స్పంద‌న ఏమిటి?

దీనిపై మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ గేం వైస్ ప్రెసిడెంట్ డేవ్ మెకార్థీ స్పందించారు. త‌క్ష‌ణం త‌మ ఏజ్ వెరిఫికేష‌న్ ప్రాసెస్‌ను మెరుగుప‌రుస్తామ‌ని, మైన‌ర్ల ఎకౌంట్ క్రియేష‌న్‌లో త‌ల్లిదండ్రుల‌ను త‌ప్ప‌నిస‌రిగా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని బ్లాగ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ‘దుర‌దృష్ట‌వ‌శాత్తు క‌స్ట‌మ‌ర్ల అంచ‌నాల‌ను మేం అందుకోలేక‌పోయాం. ఈ తీర్పును గౌర‌విస్తూనే స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటాం’ అని తెలిపారు.

అమెజాన్‌పైనా వ‌ర‌స ఆరోప‌ణ‌లు

వ్య‌క్తిగ‌త గోప్య‌త ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌సిద్ధ సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అమెజాన్ విక్ర‌యిస్తున్న ఎకో డివైజ్‌లు వ్య‌క్తిగ‌త డేటాను ర‌హ‌స్యంగా వింటూ సేక‌రిస్తున్నాయ‌ని వార్తలు వ‌చ్చాయి. చిన్న పిల్ల‌ల వాయిస్ రికార్డుల‌ను సైతం సేక‌రిస్తోంద‌ని నిర్ధ‌ర‌ణ అయింది. దీనిపై త‌గిన నిర్ణ‌యం తీసుకోక‌పోతే క‌ఠిన చ‌ర్య‌ల‌కు వెన‌కాడ‌బోమ‌ని అమెరికా ప్ర‌భుత్వం గ‌త వారంలో అమెజాన్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

దీంతో త‌ప్పుఒప్పుకొన్న అమెజాన్ సుమారు 25 మిలియ‌న్ డాల‌ర్ల‌ను న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించ‌డానికి ఒప్పుకొంది. ఈ కేసులోనే కాకుండా అమెజాన్ విక్ర‌యించే డోర్‌బెల్ కెమేరా సేక‌రించే డేటా యాక్సెస్‌ను త‌మ సంస్థ ఉద్యోగుల‌కు ఇచ్చిన‌ట్లు బ‌య‌ట‌కు రావ‌డంతో 5.8 మిలియ‌న్ డాల‌ర్లను జ‌రిమానాగా చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Latest News