MIM MLA Akbaruddin
విధాత: తెలంగాణ అభివృద్ధిని ఆదర్శనీయంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల అనంతరం కూడా మళ్లీ సీఎంగా అవుతారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ అన్నారు. తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతిపై లఘు చర్చలో అక్బరుద్ధిన్ మాట్లాడుతు తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మళ్లీ తెలంగాణలో బీఆరెస్ పార్టీనే గెలుస్తుందన్నారు.
తెలంగాణ సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం 3,12,198కి పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న రాష్ట్రాల్లో 700కోట్లకు మించి నిధులు కేటాయించలేదన్నారు. కేవలం 50లక్షల మంది ముస్లిం జనాభా ఉన్న తెలంగాణలో 2,200కోట్లకు పైగా బడ్జ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు.
తెలంగాణ రెండో హజ్ హౌజ్‌కు 23కోటు్ట్లు కేటాయించారని, 57,58జీవోల ద్వారా పట్టాలిచ్చారన్నారు. మైనార్టీ విద్యార్థులకు ఓవర్సిస్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఇదంతా మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు .సీఎం కేసీఆర్‌ను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలన్నారు. దేశానికి తొమ్మిదేళ్లలో దిక్సూచిగా మారిందన్నారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ మత ఘర్షణలు లేకపోవడం ప్రభుత్వ సమర్ధతకు నిదర్శనమన్నారు. దీనికి తెలంగాణ ముస్లింగా తాను గుండెమీద చేయివేసుకుని గర్విస్తున్నానన్నారు. బంగారు తెలంగాణ సాధన అడుగులకు కోటా పేట భూముల వేలం నిదర్శనమన్నారు.
తెలంగాణలో అద్భుత రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, కొత్త సచివాలయం నిర్మించారని, 24గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నారని, షాదీముబారక్ వంటి పథకాలు అందిస్తున్నారన్నారు. ఆసరా పింఛనన్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలు, కంటి వెలుగు, బస్తీ, పల్లె దవఖానాలు, మిషన్ కాకతీయ, భగీరథ, హరితహారం వంటి పథకాలు అభివృద్ధిలో కీలకంగా నిలిచాయన్నారు.