Site icon vidhaatha

ఆర్డీవోపై సీఎస్‌కు మంత్రి పొన్నం ఫిర్యాదు

విధాత, హైదరాబాద్‌ : నా ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపిన ఆర్డీఓ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితో కల్యాణలక్ష్మి చెక్కులు పంచనివ్వకండి అంటూ తహశీల్ధార్‌ను ఫోన్‌లో మంత్రి పొన్నం ఆదేశించారు.


తహశీల్ధార్ లేదా స్థానిక అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో చెక్కులను పంపిణీ చేయండని, కౌశిక్‌రెడ్డితో మాత్రం చెక్కుల పంపిణీ నిర్వహించరాదంటూ ఫోన్‌కాల్‌లో మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆడియో కాల్‌ను ఆర్డీవో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పంపించారు. ఈ విషయం తెలిసిన పొన్నం ఇందుకు బాధ్యుడైన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

Exit mobile version