Site icon vidhaatha

Minister Tummala | మళ్లీ తెలంగాణలో భూసార పరీక్ష కేంద్రాలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భూసార పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 25 భూసార పరిక్షా కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

మట్టి నమునా ద్వారా నేల స్వభావం తెలుసుకొని అందుకనుగుణంగా పంటలు వేసి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో తొమ్మిది, ఒక చోట ప్రాంతీయ భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్ యార్డుల్లో 14, ఒక చోట మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. గత బీఆరెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అవన్ని ప్రస్తుతం మూతపడే స్థితి చేరుకున్నాయని అరోపించారు.

Exit mobile version