విధాత, మునుగోడు మండల కేంద్రంలో రేపు నిర్వహించనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు హాజరు కానున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుధవారం పర్యవేక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు హాజరవుతారని ఆయన తెలిపారు.
ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, టీఆర్ఎస్ మండలా అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ ఈద నిర్మల శరత్ బాబు, సింగారం సర్పంచ్ గుర్రాల పరమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీను, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.