- క్యాంపు కార్యాలయం ప్రారంభం
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ ను గెలిపించారని, నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం రోహిత్ రావు దంపతులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, సతీమణి శివాని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, వాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆవుల గోపాల రెడ్డి, సురేందర్ గౌడ్, బొజ్జ పవన్, జీవన్ రావు, గంగా నరేందర్, రాజిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.