Site icon vidhaatha

ఆయనే ప్రొటెమ్ స్పీకర్ అయితే నేను ప్రమాణం చేయను: ఎమ్మెల్యే రాజాసింగ్

విధాత : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే అయన ఛాంబర్లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.


రాజాసింగ్ 2018 ఎన్నికల్లో తర్వాత కూడా అప్పటి ప్రొటెమ్ స్పీకర్ ముంతాజ్‌ఖాన్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. దేశం పట్ల, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీ ప్రొటెమ్ స్పీకర్‌గా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్ ఆయన ముందు ప్రమాణస్వీకారానికి నిరాకరించారు. ఆ తర్వాతా పూర్తి స్థాయి స్పీకర్‌గా ఎన్నికైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముందు ఎమ్మెల్యేగా పదవి ప్రమాణాస్వీకారం చేశారు.

Exit mobile version