Site icon vidhaatha

మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

విధాత, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. సోమవారం హనుమకొండ భవాని నగర్‌లోని ఎంఎల్ఏ నివాసంలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరు పల్లి రైతులతో రేవూరి ప్రకాశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని,భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా అధికారులకు, ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమవంతుగా రైతులు సహకరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ భూసేకరణ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు.

Exit mobile version