Site icon vidhaatha

లంచం తీసుకుంటూ పట్టుబడిన పరకాల సబ్‌రిజిస్టార్

విధాత, వరంగల్ ప్రతినిధి:హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు
నిర్వహించి సబ్ రిజిస్టార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి .నరేష్ ను రెడ్‌హ్యండెడ్‌గా గురువారం పట్టుకున్నారు.

గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి .నరేష్ ను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 80,000 నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో పాటు, ప్రైవేటు ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Exit mobile version