Gujarat Assembly Elections | ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఓవైసీ సూరత్‌లో సభ నిర్వహించారు. సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరఫున మాజీ ఎమ్మెల్యే వరీష్ పఠాన్ బరిలో దిగారు.
అయితే నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఓవైసీ ప్రసంగిస్తుండగా.. మోదీ మోదీ అంటూ కొంతమంది యువకులు నినదించారు. అంతేకాకుండా సభలో నల్ల జెండాలను ఎగురవేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓవైసీ మద్దతుదారులు ఎంఐఎం జెండాలను ఎగురవేశారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఎంఐఎం పోటీ చేయిస్తుంది. గత వారం వందేభారత్ రైల్లో ప్రయాణిస్తున్న అసదుద్దీన్ ఓవైసీపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.