Mood of the Nation |
విధాత: కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు ఎంతగా హడావుడి చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్‌కు జవసత్వాలు తెస్తుందే తప్ప దాన్ని రేసుగుర్రం మాదిరిగా పరుగెత్తించడం కష్టం అని తెలుస్తోంది.
ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట చేపట్టిన సర్వేలో మళ్ళీ టాప్ పొజిషన్లో మోడీ నిలిచారు. ఈ సరి కూడా మోడీ సారధ్యంలోని ఎన్డీయే కు తిరుగులేదని, బ్రహ్మాండమైన ఫలితాలు సాధించి అధికారం చేపడుతుందని ఆ సర్వే చెప్పింది.
ఆమధ్య కాలంతో పోలిస్తే మోడీ హవా కాస్త తగ్గినా అధికారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సర్వే చెబుతోంది. వాస్తవానికి 545 లోక్ సభ స్థానాలకు 2019లో ఎన్నికలు జరగ్గా ఎన్డీయేకు 352 సీట్ల భారీ మెజారిటీ దక్కగా కాంగ్రెస్ కూటమికి 91 సీట్లు మాత్రమే వచ్చాయి.
ఇక మూడో కూటమికి మాత్రం 95 సీట్లు వచ్చాయి. ఇక 2024లో సైతం బిజెపి తన మెజారిటీని కొనసాగిస్తుందని, దాదాపు 306 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కూటమి బాగా పుంజుకుని 193 సీట్లకు ఎదుగుతుంది.
ఇక మూడో కూటమి 44 సీట్లకు పరిమితం అవుతుంది అని సర్వే వెల్లడిస్తోంది. మోడీ పనితీరు పట్ల 64 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.