Site icon vidhaatha

MP Gaddam Vamsi: ఎంపీ గడ్డం వంశీ సంచలన వ్యాఖ్యలు

MP Gaddam Vamsi: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పుష్కరాలలో మంత్రి సీతక్క తో పాటు హాజరై కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్ లో పుణ్య స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ మంత్రి సీతక్క ముందే పుష్కరాల సందర్భంగా తన పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన ప్రోటోకాల్ వివక్షతపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పుష్కరాల సందర్భంగా జరిగిన పరిణామాలు నాకు కొంచం బాధ వేశాయని..నా హక్కుల కోసం పోరాడిన దళిత సంఘాలకు ధన్యవాదాలు..ఈ రోజు ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను..డబ్బు కంటే కులం ముఖ్యమన్న వాస్తవాన్ని నేను నేర్చుకున్నానని తెలిపారు. కులం బట్టి అందరూ ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో నేను తెలుసుకున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులున్నాయని..అంటరాని తనం, కుల వివక్షత ఉండరాదని పేర్కొందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని తెలిపారు. సరస్వతి పుష్కరాల కోసం వచ్చిన భక్తులంతా క్షేమంగా తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ లో కులాల ఆధిపత్యం వివక్ష పై స్వయంగా అధికారపార్టీ ఎంపీ గడ్డం వంశీ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Exit mobile version