Site icon vidhaatha

Ishant Sharma | ధోని.. కూల్ కెప్టెన్ కాదు! తోటి ప్లేయ‌ర్స్‌ని.. బండ బూతులు తిట్టేవాడు

Ishant Sharma |

మూడు ఫార్మాట్స్‌లో ఐసీసీ క‌ప్ అందుకున్న తొలి భార‌త కెప్టెన్‌గా రికార్డులు అందుకున్న ధోని మిస్ట‌ర్ కూల్‌గా అంద‌రిచే పిల‌వ‌బ‌డుతుంటారు. అయితే అత‌ను మిస్ట‌ర్ కూల్ కాదని, తోటి ప్లేయ‌ర్స్‌ని బండ బూతులు తిడ‌తాడ‌ని ఇషాంత్ శ‌ర్మ సంచ‌లన కామెంట్స్ చేశాడు.

తాజాగా టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన ఇషాంత్ శ‌ర్మ‌.. ధోని భాయ్‌కి చాలా ప్ల‌స్ పాయింట్స్ ఉన్నాయి. అయితే అంద‌రు అత‌నిని కూల్ అండ్ కామ్ అనుకుంటారు. కాని అది కాదు. ఫీల్డింగ్ స‌మ‌యంలో అత‌ను బూతులు తిడుతుంటాడు. నేను చాలా సార్లు విన్నాను.

ఓ మ్యాచ్‌లో నా బౌలింగ్‌ కోటా పూర్తి అయింది. అప్పుడు మహీ భాయ్‌ నా ద‌గ్గర‌కు వచ్చి నీవు అలసి పోయావా అని అడిగాడు. అప్పుడు నేను బాగా అలిసిపోయానని చెప్పా. దాంతో అత‌ను నీకు వయస్సు పైబడుతుంది, రిటైర్‌ అయిపో అని అన్నాడు. అప్పుడు నేను ధోని మాటలకు ఆశ్చర్యపోయా.

అయితే నాపై మహీ భాయ్ ఎప్పుడూ అంత ఆగ్రహం వ్యక్తం చేయలేదని ఇషాంత్ అన్నాడు. ఇక ఐపీఎల్ అయినా లేక ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కూడా ఆయ‌న చుట్టూ జ‌నాలు మూగుతుంటారు. ఎప్పుడు మ‌హీ భాయ్ తో ఎవ‌రో ఒక‌రు మాట్లాడుతూనే ఉంటారు.

ఓ ఊరి వాతావ‌ర‌ణం మ‌న‌కు క‌నిపిస్తుంది. ధోని ప‌డుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఒక్క‌డు ఉంటాడు. మిగ‌తా స‌మయంలో ఎవ‌రో ఒకరు ఆయ‌న‌తో ఉంటారు. రూమ్ లో కూడా ఎవరో ఒకరు అతనితో మాట్లాడుతూనే ఉంటారు” అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version