Site icon vidhaatha

Musi Project | మూసీ గేట్లు ఎత్తివేత‌

Musi Project

విధాత‌: నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం మూసీ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్ట్‌లోకి వ‌ర‌ద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను 642.5 0 అడుగులకు ప్రాజెక్టు నీటిమట్టం చేరింది. దీంతో రెండు గేట్లు (1.5 Fts) ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. 1880 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ఈ భారీ వ‌ర్షాల దృష్ట్యా మూసి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చ‌రికలు జారీ చేశారు.

Exit mobile version