విధాత : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుత సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్ డాలర్ల సంపాదనతో మాస్క్ తన తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఏర్పడిన విభేదాలతో మస్క్ ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూసినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో నిలవడం విశేషం. కొన్నాళ్లుగా వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచిన అమెజాన్ అధినేత బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ లు ఈ సారి ఓ స్థానం కిందకు దిగారు. ఒరాకిల్ సంస్థ అధినేత ల్యారీ ఎలిసన్ ఈసారి రెండో స్థానాన్ని సాధించాడు. సంస్థ లాభాల నేపథ్యంలో సంస్థ షేర్ వారంలోనే అమాంతంగా పెరిగిపోగా ఎలిసన్ సంపద 40బిలియన్ డాలర్లు పెరిగి 258బిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడో స్థానంలో మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్(238 బిలియన్ డాలర్లు), నాల్గవ స్థానంలో అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్(228 బిలియన్ డాలర్లు), ఐదవ స్థానంలో వారెన్ బఫెట్(152.1 బిలియన్ డాలర్లు)తో నిలిచారు.
భారతీయ కుబేరులు వీరే
భారతీయుల్లో ముకేశ్ అంబానీ(107.6బిలియన్ డాలర్లు) 16వ స్థానంలో, గౌతమ్ అంబానీ(65.5బిలియన్ డాలర్లు) 24వ స్థానంలో నిలిచారు. శివనాడర్(37.4) 46వ స్థానంలో, సావిత్రి జిందాల్(36.7) 47వ స్థానంలో నిలిచారు. దిలీప్ సంఘ్వీ (26.4) 75స్థానంలో, సైరస్ పూనావాలల(24.7) 82వ స్థానంలో, కుమారం మంగళం బిర్లా(21.1) 101వ స్థానంలో, కుషాల్ పాల్ సింగ్ (18.6) 113వ స్థానంలో, లక్ష్మి మిట్టల్(18.0) 121స్థానంలో, రాధాకృష్ణ దమాని (17.4) 126వ స్థానంలో, ఉదయ్ కొటక్(15.2) 160వ స్థానంలో నిలిచారు.
తెలుగు కుబేరులు వీరే
తెలుగు వారిలో మురళీ దివీస్ (10.9బిలియన్ డాలర్లు) 249వ స్థానంలో, పార్థసారధి రెడ్డి(3.9) 973వ స్థానంలో, ప్రతాప్ రెడ్డి(3.3) 1149వ స్థానంలో, జీఎం రావు(3.3)1160వ స్థానంలో, మహిమా దాట్ల(3.2) 1173వ స్థానంలో, పీవీ రాంప్రసాద్ రెడ్డి(3.0) 1294వ స్థానంలో, ఎం.సత్యనారాయణ రెడ్డి(2.6) 1446వ స్థానంలో, జూపల్లి రామేశ్వర్ రావు(2.4) 1548వ స్థానంలో, పీవీ.కృష్ణారెడ్డి(2.2) 1715వ స్థానంలో, పీపీ రెడ్డి(2.1) స్థానంలో 1787 స్థానంలో ఉన్నారు.