విధాత: నభా నటేష్ (Nabha Natesh0.. గ్లామర్ విషయంలో ఎటువంటి హద్దులు పెట్టని ఈ భామకి కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు కూడా ఆమెని లైమ్ లైట్‌లో లేకుండా చేశాయి.
మధ్యలో షోల్డర్ బోన్ సర్జరీ కూడా ఆమెను కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత చెప్పుకోవడానికి సరైన సినిమా పడలేదు. సినిమాలైతే చేసింది కానీ.. హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు.
‘డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్’.. ఇలా వరుస పరాజయాల తర్వాత ఓటీటీలో వచ్చిన ‘మాస్ట్రో’ కూడా ఆమెని కాపాడలేక పోయింది. ఇలా వరుస పరాజయాలతో, ఆ తర్వాత షోల్డర్ బోన్ సర్జరీతో కొన్నాళ్లగా కనిపించకుండా పోయిన ఈ భామ ఇప్పుడు కొత్త అందాలతో దర్శనమిచ్చింది.
వైట్ డ్రస్సులో అందాలను ఒలకపోస్తూ తాజాగా ఆమె ఓ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరి ఈ ఫొటోల తర్వాతైనా అమ్మడి జాతకం మారి.. ఓ నాలుగు అవకాశాలు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే.. ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకునేందుకు నభా నటేష్ సాధ్యమైనంతగా తన అందాలను ఎక్స్‌పోజ్ చేస్తుంది.
ఈ బ్యూటీ మళ్లీ ఎలా బ్యాకప్ అవుతుందో తెలియదు కానీ.. ఈ ఆరబోతతో మాత్రం కాస్త ఇండస్ట్రలో అయితే కదలికను తీసుకురాగలిగింది. ఈ కదలిక ఆమెకు ఏ మేరకు యూజ్ అవుతుందో.. వెయిట్ అండ్ సీ..