Nalgonda | రేవంత్ బీఫామ్ ఇవ్వాల్సి ఉన్నా.. ఇక్కడ నేనే నా టికెట్ డిక్లేర్ చేసుకుంటున్నా: ఎంపీ కోమటిరెడ్డి

Nalgonda విధాత: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అవేవీ సాధ్యపడలేదని అవినీతి మోసపూరిత సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను నెరవేరుతుందని మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ నిరుద్యోగ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పాలన పై నిప్పులు చెరిగారు. శ్రీశైలం సురంగం ప్రాజెక్టును ఉదయంసముద్రం ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామని ఎన్నికలలో చెప్పి […]

  • Publish Date - April 29, 2023 / 12:55 AM IST

Nalgonda

విధాత: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అవేవీ సాధ్యపడలేదని అవినీతి మోసపూరిత సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను నెరవేరుతుందని మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్లగొండ నిరుద్యోగ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పాలన పై నిప్పులు చెరిగారు. శ్రీశైలం సురంగం ప్రాజెక్టును ఉదయంసముద్రం ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామని ఎన్నికలలో చెప్పి 80 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టులను మూలన పడేశారన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రి కాకుంటే మేడ మీద తల ఉండదని, డబ్బా ఇండ్ల బదులు డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రెండోసారి ఎన్నికల ముందు దళిత బంధు పేరుతో మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు.

కేసీఆర్ స్వయంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో లంచాలు తీసుకున్నారని చెప్పారని, అవినీతి ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదన్నారు. ఆ దమ్ము ఎందుకు లేదన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదన్నారు.

జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి 80 ఎకరాల ఫామ్ హౌస్ భవంతి నిర్మించుకుంటే ఈన్నాళ్ళుగా రాజకీయంలో ఉన్న ఉత్తంకుమార్ రెడ్డికి, నాకు, జానారెడ్డికి సొంత ఇల్లు ఇప్పటికి లేదన్నారు. నా కింద పని చేసిన ఎమ్మెల్యే ఐదంతస్తుల భవనం కట్టారన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక దందాలు, భూ దందాలు, మద్యం దందాల్లో మునిగి తేలుతున్నారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు నింపకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ తో పేపర్ల లీకేజీ తో మోసం చేస్తున్నారన్నారు.

కల్లాలలో ధాన్యం కొనకుండా కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ సభలు పెట్టుకుంటున్నారన్నారు , ఆత్మీయ సమ్మేళనాలతో నిర్వహిస్తున్నారన్నారు. ఒక ఇల్లు, ఒక ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ మధ్యాహ్నం బిర్యాని, రాత్రి మందు పార్టీలు 10 ఊర్లకు ఒక క్లస్టర్ పెట్టి ఎన్నికలలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా ఉందో చతిస్గడ్ వెళ్లి కేసీఆర్ చూసి రావాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రుణమాఫీతో పాటు బోనస్ ఇచ్చి చత్తిస్గఢ్ తరహాలో పంటలకు మద్దతు ధర అందిస్తామన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినందున మైనార్టీ సోదరులు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి అన్నారు. ఈ నాలుగు నెలలు కష్టపడితే వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ పాలనలో గుండెల్లో పెట్టుకొని పార్టీ కార్యకర్తలకు కాపాడుతామన్నారు. ఉమ్మడి ఇప్పుడు తన ఎమ్మెల్యే ఎన్నికల తొలిదఫా ప్రచారం రేవంత్ రెడ్డి సభ తో ద్వారా పూర్తయినట్లేనన్నారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బీఫామ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇక్కడ నేను టికెట్ డిక్లేర్ చేసుకుంటున్నానని, నల్గొండ జిల్లాలో మళ్లీ 12 కు 12 సీట్లు గెలిపించాలని అందుకోసం అందరం కలిసి పని చేద్దామన్నారు. సీఎం కేసీఆర్ తనను ఓడించేందుకు నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి ప్రధాన రహదారి మినహా చేసింది ఏమీ లేదన్నారు. తాను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది ఏమీ లేదని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి పార్టీ ఆఫీస్ కట్టుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని విద్యార్థులు అవసరానికి వినియోగిస్తామన్నారు.

కెసిఆర్ పాలనలో నల్లగొండ వెనుకబాటు: ఉత్తమ్

సీఎం కేసీఆర్ పాలనలో నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు శ్రీశైలం ఉదయ సముద్రం ఎత్తిపోతలతో పాటు కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని నల్గొండ ఎంపీ ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సాగునీటి ప్రాజెక్టులు తప్పితే కొత్తగా సాధించింది ఏమీ లేదన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ సంవత్సరన్నలో పూర్తి చేయకుంటే రాజీనామా చేస్తానన్నాడని, రెండేళ్ల అయిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో లిఫ్టులకు శంకుస్థాపన చేశారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు.

మిషన్ భగీరథ పై 45 వేల కోట్లు ఖర్చు చేశారని, నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పిటిసిలు నీళ్లు రావడం లేదని మొరపెట్టుకున్నారు. అంటే మిషన్ భగీరథకు ఖర్చు పెట్టడం నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాలో ఎవరి పాత్ర ఉందని, వందల కోట్లు ఇసుక వ్యాపారం బీఆర్ఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నారన్నారు. పోలీసులు, మైనింగ్ శాఖ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు

నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైన్స్, వైన్స్, సాండూ, లాండ్స్ వ్యాపారాలు తప్పితే ప్రజాలపై దృష్టి సారించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కేవలం యువత విద్యార్థుల ,ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ కారణంగా అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణలో నిరుద్యోగ సమస్య రెట్టింపు అయిందన్నారు.

ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 12 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 40 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారని,ఇది కేసీఆర్ కు సిగ్గుచేటు కాదా అన్నారు. వందల ఉద్యోగాలు వేస్తే లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటున్న తీరు బిఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదా అన్నారు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి పేపర్లు అమ్ముకొని బిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి పరాకాష్ట అన్నారు.

పేపర్ల లీకేజీ పై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ లీకేజీ ఒక దుర్మార్గమైన చర్య, కష్టపడి చదివిన నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు . మహత్మ గాంధీ నల్గొండ యూనివర్సిటీ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేస్తే 2012 నుండి ఈరోజు వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీలలో 4వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో దళితులు గిరిజనులు బీసీలు, మైనార్టీ విద్యార్థులు సరైన సమయంలో రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. 3000 కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయి ఉందన్నారు.

తెలంగాణలో తమ్ముళ్ళకి చెల్లెళ్లకు అన్యాయం జరుగుతుందన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి పోరాడుతుందన్నారు. నిరుద్యోగ భృతి 3116 ఇస్తామని కెసిఆర్ ప్రభుత్వం చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. బకాయి ఇవ్వకుండా నిరుద్యోగులను ఓటు అడిగే అర్హత బిఆర్ఎస్ కు లేదన్నారు.

Latest News