నాగార్జున సాగర్‌ డ్యాంను సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ బృంద సభ్యులు మంగళవారం నాగార్జున సాగర్‌ డ్యాంను సందర్శించారు

  • Publish Date - February 13, 2024 / 10:17 AM IST

విధాత, హైదరాబాద్‌ : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ బృంద సభ్యులు మంగళవారం నాగార్జున సాగర్‌ డ్యాంను సందర్శించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, సీఎస్ఎంఆర్ఎస్, ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటిపారుల శాఖ అధికారులతో కూడిన13 మంది సభ్యుల బృందం నాగార్జున సాగర్‌ డ్యాంను సందర్శించారు. సాగర్ డ్యాం, గేట్లు, స్పీల్‌వే, గ్యాలరీ, రోప్స్, కుడికాలువ, హెడ్ రెగ్యులేటర్, జలవిద్యుత్ కేంద్రం, క్రస్ట్ గేట్లను, 220, 420 గ్యాలరీలను పరిశీలించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకు రానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు వినియోగంపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది.



డ్యాం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నాగార్జున సాగర్ డ్యాం వివరాలను నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. 2009నుంచి వచ్చిన వరదల వివరాలు, నీటి విడుదల జరిగిన వివరాలను, ప్రస్తుత నీటి నిల్వలు..అవసరాలు తెలుసుకున్నారు. వారి వెంట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అసిస్టెంట్ కమాండెంట్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News