Site icon vidhaatha

Netflix | పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు నెట్‌ఫ్లిక్స్‌ మంగళం..! ఎలా కట్టడి చేస్తుందంటే..?

Netflix | కరోనా మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీకి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం వరుసగా థియేటర్లలోకి సినిమాలు విడుదలవుతున్నా జనం మాత్రం ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నాయి. థియేటర్లలో పెరిగిన టికెట్ల ధరలతో హాలుకు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితులు.

దీంతో అమెజాన్‌ ప్రైజ్‌, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ సహా పలు ఓటీటీలను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటూ ఇంటిల్లిపాది సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కుటుంబంలోని ఒకే అకౌంట్‌ను తీసుకొని.. వివిధ డివైజ్‌ల్లో లాగిన్‌ అవుతున్నారు.

ఈ పాస్‌వర్డ్‌ షేరింగ్‌తో సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో ఆదాయం గణనీయంగా తగ్గుతోందని నెట్‌ఫ్లిక్స్‌ తదితర ఓటీటీ సంస్థలు వాపోతున్నాయి. ఈ క్రమంలోనే పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేయాలని నెట్‌ఫిక్స్‌ నిర్ణయించింది. అయితే, ఇప్పటికే పలు దేశాల్లో ప్రయోగాత్మకంగా పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేసింది.

పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను ఎలా అడ్డుకుంటారు?

అయితే, అందరికీ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఎలా జరుగుతుంది? ఎలా నెట్‌ఫ్లిక్స్‌ అడ్డుకుంటుంది ? ఒక వ్యక్తికి చెందిన అకౌంట్‌ను మరొకరు వినియోగిస్తే ఎలా కనిపెడతారు? అందరి మదిలో ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే, దీనిపై తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ తన వెబ్‌సైట్‌లో దీనిపై స్పందించింది. ఇకపై ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటారో.. వాళ్లు మాత్రమే ఇకపై యాక్సెస్‌ పొందేందుకు వీలుంటుంది.

వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారు అకౌంట్‌ను వినియోగించుకోవాలనుకుంటే మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన పాస్‌వర్డ్‌తో వేరేచోట ఉన్న వ్యక్తి అకౌంట్‌ను వాడుకోవాలనుకుంటే.. వారు నాలుగు అంకెల వెరిఫికేషన్‌ కోడ్‌ను తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్‌కు 15 నిమిషాలు మాత్రమే గడువు ఉంటుంది. ఒకసారి వెరిఫికేషన్‌ పూర్తయితే.. కేవలం వారం రోజులు మాత్రం అకౌంట్‌ యాక్సెస్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇక్కడే మరో మెలిక పెట్టిన నెట్‌ఫ్లిక్స్‌..

అయితే, ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ మరో మెలిక పెట్టిందే. ఎవరైతే వేరే చోటు నుంచి నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ వాడుకుంటున్నా.. వారు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వ్యక్తి ఉండే ప్రాథమిక ప్రదేశంలో 31 రోజుల్లోపు కనీసం ఒక్కసారైనా వైఫై నెట్‌వర్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అప్పుడే దాన్ని నమ్మదగిన డివైజ్‌గా నెట్‌ఫ్లిక్స్‌ గుర్తించనుండగా.. ఒకవేళ బయటి వ్యక్తులైతే ఒకే చోటు నుంచి వైఫై వాడడం సాధ్యం కాదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఆలోచన చేసింది. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వ్యక్తే.. వేరే ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలాగే నెట్‌ఫ్లిక్స్‌ను ఒకే సమయంలో ఎంత మంది వినియోగించుకోవచ్చనేది సబ్‌స్క్రైబర్‌ ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని నెట్‌ఫ్లిక్‌ పేర్కొంది. అయితే, పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానంతో నెట్‌ఫ్లిక్స్‌కు భారీగా నష్టం జరుగుతున్నది. స్వతంత్ర అంచనా ప్రకారం దాదాపు వంద మిలియన్ల మంది నెట్‌ఫ్లిక్స్‌కు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. గతేడాది కంపెనీకి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా మిలియన్‌ చందాదారులను కోల్పోయింది. స్టాక్స్‌లో 26శాతం తగ్గగా.. సుమారు 40 బిలియన్ల విలువైన సంపద తుడిచిపెట్టుకుపోయింది.

Exit mobile version