NIRF | దేశంలోనే అత్యుత్త‌మ యూనివ‌ర్సిటీగా.. ‘IISC బెంగ‌ళూరు’కు ఫ‌స్ట్ ర్యాంక్‌

NIRF | రెండు, మూడు స్థానాల్లో జేఎన్‌యూ జ‌మియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ ర్యాంకులు ప్ర‌క‌టించిన ఎన్ఐఆర్ఎఫ్ విధాత‌: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగ‌ళూరు దేశంలోనే అత్యుత్త‌మ యూనివ‌ర్సిటీగా నిలిచింది. భారతదేశ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్‌లో మొద‌టి స్థానం కైవ‌సం చేసుకున్న‌ది. ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గ‌డించింది. త‌ర్వాతి స్థానాల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాల‌యం నిలిచాయి. ఈ […]

  • Publish Date - June 5, 2023 / 09:09 AM IST

NIRF |

  • రెండు, మూడు స్థానాల్లో జేఎన్‌యూ
  • జ‌మియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ
  • ర్యాంకులు ప్ర‌క‌టించిన ఎన్ఐఆర్ఎఫ్

విధాత‌: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగ‌ళూరు దేశంలోనే అత్యుత్త‌మ యూనివ‌ర్సిటీగా నిలిచింది. భారతదేశ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్‌లో మొద‌టి స్థానం కైవ‌సం చేసుకున్న‌ది.

ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గ‌డించింది. త‌ర్వాతి స్థానాల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాల‌యం నిలిచాయి. ఈ మేర‌కు ఎన్ఐఆర్ఎఫ్ సోమ‌వారం ర్యాంకుల‌ను విడుద‌ల చేసింది.

టాప్ టెన్‌లో హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీ

ఎన్ఐఆర్ఎఫ్ ప్ర‌క‌టించిన ర్యాంకుల జాబితాలో హైద‌రాబాద్ యూనిర్సిటీ టాప్ టెన్ జాబితాలో చోటు ద‌క్కించుకున్న‌ది. యూహెచ్ ప‌ద‌వ ర్యాంకును కైవ‌సం చేసుకున్న‌ది. ఐఐటీ మ‌ద్రాస్ ప‌రిశోధ‌న‌ల‌కు ఉత్త‌మ కేంద్రంగా నిలిచింది.

వ‌రుస‌గా ఎనిమిది సంవ‌త్స‌రాలుగా అత్యుత్త‌మ ప‌రిశోధ‌నా కేంద్రంగా ఐఐటీ మ‌ద్రాస్ ర్యాంకును నిలుపు కోవ‌డం విశేషం. ఆవిష్కరణల విషయంలో ఐఐటీ కాన్పూర్ అగ్రస్థానంలో ఉండగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎన్ఐఆర్ఎఫ్ ప్ర‌క‌టించిన ర్యాంకుల జాబితా ఇలా..

ర్యాంకు యూనివ‌ర్సిటీ పేరు

1, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగ‌ళూరు
2, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
3, జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ, న్యూఢిల్లీ
4, జాద‌వ్‌పూర్ యూనివ‌ర్సిటీ, కోల్‌క‌త్తా
5, బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యం, వార‌ణాసి
6, మ‌ణిపాల్ అకాడ‌మీ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్, మ‌ణిపాల్‌
7, అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబ‌త్తూర్‌
8, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వెల్లూర్‌
9, అలీగ‌ఢ్ ముస్లిం యూనివ‌ర్సిటీ, అలీగ‌ఢ్‌
10, యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌, హైద‌రాబాద్‌

Latest News