Nitin Gadkari | సైర‌న్‌కు బ‌దులుగా భార‌తీయ సంగీతం.. కొత్త పాల‌సీపై నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌ట‌న‌

Nitin Gadkari | ప్రోటోకాల్‌లో భాగంగా ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వీఐపీ కార్ల‌కు సైర‌న్ ఉంటుంది. సైర‌న్ మోగుతూ వీరి కాన్వాయ్‌లు వేగంగా దూసుకెళ్తుంటాయి. అలాంటి స‌మ‌యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియ‌ర్ చేసి.. వారి వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు. అయితే ఈ సైర‌న్‌ను కొంద‌రు దుర్వినియోగం చేస్తున్న‌ట్లు కేంద్రం దృష్టికి వ‌చ్చింది. వీఐపీలు వాహ‌నాల్లో లేక‌పోయిన‌ప్ప‌టికీ.. సిగ్న‌ల్స్ వ‌ద్ద సైర‌న్ మోగిస్తున్నారు. అంతే కాకుండా అనుమ‌తి లేకుండానే త‌మ వాహ‌నాల‌కు సైర‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప‌లువురు ఇబ్బందులు […]

  • Publish Date - August 13, 2023 / 02:17 PM IST

Nitin Gadkari | ప్రోటోకాల్‌లో భాగంగా ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వీఐపీ కార్ల‌కు సైర‌న్ ఉంటుంది. సైర‌న్ మోగుతూ వీరి కాన్వాయ్‌లు వేగంగా దూసుకెళ్తుంటాయి. అలాంటి స‌మ‌యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియ‌ర్ చేసి.. వారి వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు.

అయితే ఈ సైర‌న్‌ను కొంద‌రు దుర్వినియోగం చేస్తున్న‌ట్లు కేంద్రం దృష్టికి వ‌చ్చింది. వీఐపీలు వాహ‌నాల్లో లేక‌పోయిన‌ప్ప‌టికీ.. సిగ్న‌ల్స్ వ‌ద్ద సైర‌న్ మోగిస్తున్నారు. అంతే కాకుండా అనుమ‌తి లేకుండానే త‌మ వాహ‌నాల‌కు సైర‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప‌లువురు ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌బ్ద కాలుష్యానికి కూడా గుర‌వుతున్నారు.

ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు వాహ‌నాల సైర‌న్ మోత‌ను విన‌సొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాల‌ను రూపొందింస్తున్న‌ట్లు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. పుణెలోని చాందినీ చౌక్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా గ‌డ్క‌రీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రోజురోజుకు పెరుగుతున్న శ‌బ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచ‌డం చాలా ముఖ్య‌మ‌ని గ‌డ్క‌రీ పేర్కొన్నారు. వీఐపీల వాహ‌నాల‌న‌పై ఉడే రెడ్ లైట్ క‌ల్చ‌ర్‌కు స్వ‌స్తి ప‌ల‌క‌బోతున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు వీఐపీ వాహ‌నాల్లో సైర‌న్ కూడా తొల‌గించాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. ఇందుకోసం కొత్త విధివిధానాలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.

సైర‌న్‌కు బ‌దులుగా భార‌తీయ సంగీత వాయిద్యాలైన పిల్ల‌న‌గ్రోవి, త‌బ‌లా, వ‌యోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శ‌బ్దం విన‌ప‌డేలా మార్పులు చేసేందుకు నిబంధ‌న‌లు సిద్ధం చేస్తున్నామని గ‌డ్క‌రీ స్ప‌ష్టం చేశారు. శ‌బ్ద కాలుష్యం నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డ‌మే దీని ముఖ్య ఉద్దేశ‌మ‌ని ఆయ‌న తెలిపారు.

Latest News