Site icon vidhaatha

JOBS: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 247 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ

విధాత‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 247 అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటీఫికేషన్‌ జారీచేసింది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకుల‌ను నియమించనున్నారు. అర్హులైన అధ్యాపకులు ఈనెల 14 నుంచి జనవరి 4 వ తేదీ వరకు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది.

అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థికశాఖ గత జులై 23న జీవో జారీచేసింది. అప్పుడు 247 అధ్యాపక ఖాళీలతో పాటు 14 జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రేరియన్‌, 37 ఫిజికల్‌ డైరెక్టర్‌, 25 ఎలక్ట్రీషియన్‌, ఐదు మ్యాట్రన్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధ్యాపకుల ఖాళీల భర్తీకే నోటిపికేషన్‌ ఇచ్చింది. మిగిలిన 112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉన్నది.

Exit mobile version