Site icon vidhaatha

Tana | తానాలో.. తన్నుకున్న NRIలు! అమెరికాలో జూ. ఎన్టీఆర్‌.. లోకేష్ అభిమానుల మధ్య గొడవ

Tana |

విధాత‌: అమెరికా వెళ్లినా అంతరిక్షానికి వెళ్లినా గొడవలు ఉండాల్సిందే.. అభిమానుల పేరిట కొట్టుకోవాల్సిందే.. అమెరికాలో ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి. దీనికి పలువురు టిడిపి అభిమానులు ఆంధ్రా నుంచి వెళ్లగా.. అమెరికాలో ఉండే టిడిపి కార్యకర్తలు.. చంద్రబాబు అభిమానులు సైతం హాజరయ్యారు.

అయితే ఈ సందర్భముగా జూనియర్ ఎన్టీయార్ అభిమాని ఒకరు జై ఎన్టీయార్ అని నినదించడంతో లోకేష్.. చంద్రబాబుల అభిమానులు ఆయన మీద దాడిచేసి కొట్టారు. టిడిపి ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో అక్కడి యువత రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిమీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.

ఈ సభ టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు.. పార్టీకి హైప్ తేవడానికి ఏర్పాటు చేసినందున ఇక్కడ జానియర్ ఎన్టీయార్ ప్రస్తావన ఎందుకు ? ఆయనకు తెలుగుదేశానికి ఏమి సంబంధం అంటూ లోకేష్ అభిమానులు ఆ కుర్రాడి మీదపడి కొట్టినట్లు తెలుస్తోంది.

అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్ ఆనవాళ్లు, ఉనికి అవసరం లేదని.. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి భావిస్తోంది. ఆమధ్య గుడివాడలో చంద్రబాబు సభలో కొందరు అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ ఫోటోలు ప్రదర్శించి జోహార్ హరికృష్ణ అని నినదించినందుకు వారిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీయార్ శత జయంతి సభ విజయవాడలో నిర్వహించినా జూనియర్ కు పిలుపు రాలేదు.

Exit mobile version