Oppo A59 5G | సరికొత్త ఫోన్‌ లాంచ్‌ చేసిన ఒప్పొ. 15వేల లోపే 5జీ ఫోన్‌!

ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చింది.

  • Publish Date - December 23, 2023 / 04:13 AM IST

Oppo A59 5G | చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పొ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏ59-5జీ ఫోన్‌ను కంపెనీ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒప్పో వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఈ నెల 25 నుంచి అమ్మకాలు మొదలవనునాయి. ఫోన్‌ ఫీచర్స్‌, ధర ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి..!

ఫీచర్స్‌ ఇవే..

ఒప్పొ ఏ59- 5జీ మొబైల్‌లో 6.56 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5జీ ఎస్ఓసీ ప్రాసెర్‌ సెటప్‌ ఉంటుంది. స్టారీ బ్లాక్, సిల్క్ గోల్డ్ మూడురంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో మొదలవుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ సెటప్‌ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్టోరేజీని ఒక టీబీ వరకు పెంచుకునే వీలుంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5వేల ఎంఏహెచ్. 33వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. 300శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌తో లౌడ్ స్పీకర్ల సౌండ్ ఎక్కువగా వస్తుంది.

ధర ఎంతంతో తెలుసా..?

ఒప్పొ ఏ59- 5జీ మొబైల్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సైతం అందుబాటులో ఉంది. ఈ నెల 25 నుంచి ఏ59 5జీ ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఔట్‌లెట్లలో ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది. ప్రారంభోత్సవ ఆఫర్‌ సందర్భంగా ఫోన్‌ను మొదటగా కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.1500 క్యాష్‌ బ్యాక్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తున్నది. అంతే కాకుండా నో కాస్ట్‌ ఈఎంఐ సైతం ఉన్నది. ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్, వన్ కార్డులపై ఆఫర్‌ వర్తిస్తుంది.