OTT | ఓటీటీల్లో ఈరోజు 16 కొత్త సినిమాల సందడి .. హారర్ నుంచి కామెడీ వరకూ వినోదాల‌ విందు!

OTT | ఈరోజు (ఫిబ్రవరి 13) ఓటీటీ ప్రేక్షకులకు పండుగరోజులా మారింది. ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

OTT | ఈరోజు (ఫిబ్రవరి 13) ఓటీటీ ప్రేక్షకులకు పండుగరోజులా మారింది. ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి డిఫరెంట్ జానర్లలో కంటెంట్ విడుదల కావడంతో సినీప్రియులకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. ముఖ్యంగా తెలుగులో డబ్బింగ్ కంటెంట్ కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Netflix లో విడుదల

ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో పలు ఇంటర్నేషనల్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. అమెరికన్ రోడ్ కామెడీ “టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్”, టర్కీష్ రొమాంటిక్ డ్రామా సిరీస్ “ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్”, సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ “ది ఆర్ట్ ఆఫ్ సారా”, అర్జెంటీనా ప్రిజన్ డ్రామా “ఇన్ ది మడ్ సీజన్ 2” విడుదలయ్యాయి. రేపు (ఫిబ్రవరి 14) ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా “బ్లూ మూన్” స్ట్రీమింగ్ కానుంది.

Amazon Prime Video లో

హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ “బ్యాండ్‌వాలే” తో పాటు ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా తెలుగు డబ్బింగ్ “లవ్ మీ లవ్ మీ” అందుబాటులోకి వచ్చాయి.

ZEE5 లో

మరాఠీ ఫ్యామిలీ డ్రామా “ఉత్తర్”, బెంగాలీ హారర్ కామెడీ “భానుప్రియ భూతర్ హోటల్”, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ “పాతిరాత్రి” ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Sun NXT లో

కన్నడ రొమాంటిక్ యాక్షన్ “సూర్య: ది పవర్ ఆఫ్ లవ్”, తమిళ రొమాంటిక్ డ్రామా “మాయాబింబమ్” స్ట్రీమింగ్ మొదలైంది.

ఇతర ఓటీటీల్లో ప్రత్యేక విడుదల :

JioHotstar – తెలుగు డబ్బింగ్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ “ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్”

Apple TV+ – ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ డ్రామా “ఎటర్నిటీ”

Shudder – సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ “హనీ బంచ్”

Lionsgate Play – సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ది రఫ్ నెక్”

 

ఈరోజు విడుదలైన కంటెంట్‌లో హారర్, థ్రిల్లర్ సినిమాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ది కంజూరింగ్, హనీ బంచ్, భానుప్రియ భూతర్ హోటల్, ది ఆర్ట్ ఆఫ్ సారా, పాతిరాత్రి వంటి చిత్రాలు థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్‌గా మారాయి. మొత్తం విడుదలల్లో సుమారు 11 సినిమాలు స్పెషల్ క్యాటగిరీలో నిలుస్తుండగా, తెలుగులో ఆసక్తికరంగా అనిపించే విడుదలలు మాత్రం మూడు వరకు మాత్రమే ఉండటం గమనార్హం.

మొత్తానికి ఈరోజు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో విభిన్న జానర్లలో భారీ కంటెంట్ అందుబాటులోకి రావడంతో వీకెండ్‌కు ముందే సినీ ప్రియులకు వినోద విందు సిద్ధమైంది.

Latest News