Cold Drinks | 2026లో భాగంగా ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Cricket Stadium) నెదర్లాండ్స్, నమీబియా (Netherlands- Namibia) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కల్తీ పానీయాలు..
స్టేడియంలో తాగి మిగిలిపోయిన కూల్‌డ్రింక్స్‌ను (Cold Drink) అక్కడి సిబ్బంది తిరిగి బాటిల్స్‌లో నింపుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో కల్తీ పానీయాలు అమ్ముతున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు తాగిన అనంతరం మిగిలిపోయిన కూల్‌డ్రింక్‌ని మళ్లీ బాటిల్‌కి నింపి దాన్నే సర్వ్ చేస్తున్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
వ్యర్థాల సేకరణ ప్రక్రియలో ఓ భాగం
ఈ విమర్శలపై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (Delhi and District Cricket Association) స్పందించింది. కల్తీ, అపరిశుభ్రత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈవెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగానే సదరు సెల్లర్ ఈ పని చేశారని తెలిపింది. తడి, పొడి చెత్తను వేరు చేసే క్రమంలో, వినియోగించని పానీయాన్ని పారవేసే ముందు బాటిల్‌లోకి నింపినట్లు వివరించింది. ఇది వ్యర్థాల సేకరణ ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని స్పష్టతనిచ్చింది. అనంతరం ఆ బాటిళ్లను తమ వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ పాలసీ ప్రకారం బాధ్యతాయుతంగా పారవేసినట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. తాము స్టేడియంలో అత్యంత కఠినమైన పారిశుద్ధ్య నిబంధనలు పాటిస్తామని, అంగీకరించిన వాణిజ్య ఒప్పందాలు, కార్యాచరణ ప్రమాణాలకు లోబడే కూల్ డ్రింక్స్ సరఫరా జరిగిందని డీడీసీఏ తన ప్రకటనలో పునరుద్ఘాటించింది.
నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం..
ఢిల్లీలోని అరుణ్ జైట్ల స్టేడియంలో ఈనెల 10న నమీబియా-నెదర్లాండ్స్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నమీబియాపై నెదర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ 18 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. బాస్ డి లీడే 48 బంతుల్లో 72 నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
BEWARE ⚠️ The leftovers of soft drink #ThumbsUp in paper-cups are being poured into large pet bottles and sold later. This video is recorded from Arun Jaitley Stadium, Delhi! pic.twitter.com/ET0cqWPOIk
— Deepu (@deepu_drops) February 11, 2026
ఇవి కూడా చదవండి :
OTT | ఓటీటీల్లో ఈరోజు 16 కొత్త సినిమాల సందడి .. హారర్ నుంచి కామెడీ వరకూ వినోదాల విందు!
Flower Farming | 18 ఏళ్లకే పూల వ్యాపారం.. ఏడాదికి రూ. 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న తెలంగాణ బిడ్డ
