Oscar Awards | ఘనంగా ఆస్కార్ అవార్డుల పండుగ.. వేడుకల ఖర్చు ఎంతో తెలిస్తే కండ్లు బైర్లు కమ్మడం ఖాయం..!

Oscar Awards | ప్రపంచవ్యాప్తంగా సినీతారలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయ్యింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు మొదలై.. 9 గంటల వరకు పూర్తయ్యాయి. దాదాపు 23 కేటగిరిల్లో 95వ అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. ఈసారి భారత్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు వరించాయి. బెస్ట్‌ ఒరిజినల్‌సాంగ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు […]

  • Publish Date - March 14, 2023 / 05:21 AM IST

Oscar Awards | ప్రపంచవ్యాప్తంగా సినీతారలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయ్యింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు మొదలై.. 9 గంటల వరకు పూర్తయ్యాయి. దాదాపు 23 కేటగిరిల్లో 95వ అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది.

ఈసారి భారత్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు వరించాయి. బెస్ట్‌ ఒరిజినల్‌సాంగ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు ఆస్కార్‌ అవార్డులు వరించాయి. అయితే, ఈ ఈవెంట్‌ కోసం చేసిన ఖర్చు అందరిని షాక్‌కు గురి చేస్తున్నది.

వేడుకల కోసం దాదాపు 56.6 మిలియన్‌ డాలర్లు ఖర్చయ్యింది. భారత కరెన్సీలో రూ.463,92,47,300. ఇందులో ప్రసెంటర్‌గా వ్యవహరించిన నటి వేసుకున్న డ్రెస్‌ ఖరీదే పది మిలియన్‌ డాలర్లు. ఆస్కార్ వేడుకల్లో ఎవరైనా యాడ్‌ ఇవ్వాలంటే దాదాపు 30 సెకన్లకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లిచాలి.

భారత కరెన్సీలో రూ.16,39,31,000 అన్నమాట. ఇదిలా ఉండగా.. ఈ సారి ఆస్కార్‌ వేడుకల్లో పలు మార్పులు చేశారు. ప్రతీసారి అతిథులు రెడ్‌ కార్పేట్‌పై నడుచుకుంటూ వెళ్లేవారు. ఈ సారి దానికి బదులుగా షాంపైన్‌ కలర్‌ను వినియోగించారు. 95 సంవత్సరాల ఆస్కార్‌ చరిత్రలో తొలిసారి కార్పేట్‌ రంగును మార్చారు. 50వేల స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24,700 డాలర్లు.

Latest News