ప్రజా తీర్పును శిరసావహిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజా తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు

  • Publish Date - December 4, 2023 / 12:33 PM IST
  • అధైర్య పడొద్దు… ప్రజలకు అండగా నిలుద్దాం
  • శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు
  • మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజా తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో ఆమె మాట్లాడారు. 25 ఏళ్లుగా ఉద్యమంలో, రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, అధైర్య పడకుండా ముందుకు సాగినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఆడబిడ్డగా ఆదరించి సహకరించారని అన్నారు.


ప్రజలకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలుస్తూ, కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానన్నారు. ఓటమిని గెలుపుగా భావిస్తూ ముందుకు వెళదామనీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడకుండా ప్రజలకు అండగా నిలవాలన్నారు. ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.