Site icon vidhaatha

భారత్‌తో ఆడాలంటే మా ప్లేయర్స్‌ భయపడతారు..! పాక్‌ మాజీ కీపర్‌ సంచలన వ్యాఖ్యలు..!

విధాత‌: ఈ ఏడాది భారత్‌ వేదిక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జరుగనున్నది. అయితే, టోర్నీలో వామప్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాయాది జట్టు పాక్‌ భారత్‌కు చేరుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది.


ఈ నెల 5న మెగా ఈవెంట్‌ మొదలుకాబోతున్నది. ఈ నెల 14న భారత్‌తో తలబడబోతున్నది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనున్నది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో పాక్‌ జట్టు టీమిండియాతో తలపడబోతున్నది. ఈ క్రమంలో పాక్‌ మాజీ ఆటగాడు మొయిన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.



భారత్‌తో ఆడాలంటే తమ ఆటగాళ్లు భయపడతారని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లోనూ ఇదే జరిగిందని గుర్తు చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలు వందశాతం నిజమని.. ప్లేయర్స్‌ భయపడం తాను స్వయంగా చూశానని తెలిపాడు. బాబర్‌కు సలహాలు ఇచ్చేందుకు సైతం సందేహించారని.. రిజ్వాన్, షాదాబ్, షహీన్‌ తదితర ప్లేయర్స్‌ సైతం వెనుకా ముందయ్యారని.. అసలు వాళ్లేమీ చర్చించుకోలేదని చెప్పాడు. కొన్ని సలహాలు ఇచ్చినా బాబర్‌ వాటిని ఫాలో కాలేదని, కొన్నింటిని ఫాలో అయిన వర్కౌట్‌ కాలేదని పేర్కొన్నాడు.



భారత్‌తో ఆడాలంటే ఆటగాళ్లు భయపడతారని. ఎవరైతే భయపడతరో వాళ్ల సలహాలు పని చేయవని.. ఓ ప్లేయర్‌గా సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడుతూ వందశాతం ప్రదర్శన చేయాలని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కొన్ని సమస్యలు ఉన్నట్లు స్పష్టమవుతుందన్నాడు.


ప్రొఫెషనల్ క్రికెట్‌లో విభేదాలు సహజేనని వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టి మంచి ప్రదర్శన చేయాలని చెప్పాడు. ఇదిలా ఉండగా.. తొలి వామప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన పాక్‌.. 3న ఆస్ట్రేలియాతో తలపడనున్నది. ఇక వరల్డ్‌ కప్‌లో భాగంగా నెదర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్నది.

Exit mobile version