Site icon vidhaatha

Pawan Kalyan | ‘ఓజీ’ 2 పార్ట్స్‌.. ఇక పవన్‌ అభిమానులను ఆపడం కష్టమే

Pawan Kalyan |

‘బ్రో’ తర్వాత రాబోతున్న పవర్ స్టార్ సినిమా ‘ఓజీ’. ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న ‘సాహో’ దర్శకుడు సుజీత్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మూవీ సంబంధించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మొత్తం కెరీర్‌లోనే భారీ మూవీగా ‘ఓజీ’ రాబోతోంది. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. ఈ సినిమా‌ను ముంబై, జపాన్ వంటి చోట్ల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటివరకు 50 శాతం పైగా షూటింగ్ జరుపుకుందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

‘ఓజీ’ని దర్శకుడు సుజీత్ రెండు భాగాలుగా ఫ్లాన్ చేస్తున్నాడట. మూవీ కథలోని బలాన్ని ఉద్దేశించి సుజిత్ మొత్తం రెండు భాగాలుగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యాడని.. దీనికి చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడంతో ఓజీ పార్ట్ 2 కూడా రాబోతుందనే వార్త పవర్ స్టార్ అభిమానుల్ని ఆనందంలో ముంచేసింది. ఇది పవన్ ఈ మధ్యకాలంలో చేస్తున్న స్ట్రయిట్ మూవీ.

సినిమాలో పవన్ ఎంట్రీని కూడా డిఫరెంట్‌గా ఫ్లాన్ చేశారనే వార్తలు మూవీ మీద మరింత హైప్ పెంచుతున్నాయి. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మూవీ మొత్తంలో నాలుగుకు మించే ఉంటాయని అంటున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటాయనేలా మేకర్స్ వదులుతున్న అప్‌డేట్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ కానీ, వినబడుతున్న టాక్ కానీ.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అనేలా ఫ్యాన్స్‌ని వెయిట్ చేయిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. అయితే ఈ మూవీ కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు పవన్ ఆల్రెడీ కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేయనున్నారని.. ఆ తరువాత సగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

Exit mobile version