Pawan Kalyan | పొత్తుల మీద పవన్ క్లారిటీ!!

<p>Pawan Kalyan టిడిపి, బిజెపి, జనసేన కలిసి వెళతాయని వెల్లడి విధాత‌: జనసేన అధినేత ఢిల్లీలో బిజెపి పెద్దలతో ఏమి మాట్లాడారో తెలియదు.. కానీ ఒక విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పారు. ఎలాగైనా జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని తేల్చేశారు. అసలు ఈ మూడు పార్టీల పొత్తుల మీద బిజెపి పెద్దల అభిప్రాయం తీసుకున్నారో లేదో కానీ తాను మాత్రం ఇలా పొత్తుకు ఫిక్స్ అయిపోయినట్లు చెప్పేశారు. […]</p>

Pawan Kalyan

విధాత‌: జనసేన అధినేత ఢిల్లీలో బిజెపి పెద్దలతో ఏమి మాట్లాడారో తెలియదు.. కానీ ఒక విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పారు. ఎలాగైనా జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని తేల్చేశారు.

అసలు ఈ మూడు పార్టీల పొత్తుల మీద బిజెపి పెద్దల అభిప్రాయం తీసుకున్నారో లేదో కానీ తాను మాత్రం ఇలా పొత్తుకు ఫిక్స్ అయిపోయినట్లు చెప్పేశారు. మరీ బిజెపితో సంప్రదించకుండా తానొక్కడే ఎలా అలా ప్రకటించారు ?? ఈయన ఒంటెద్దు పోకడలను మోడీ, అమిత్ షా ఒప్పుకుంటారా అన్నది తెలియడం లేదు.

ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అని అంటూ.. బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని కూడా చెప్పేశారు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని అన్నారు. తనకు ఏపీ చాలా ముఖ్యం అన్నారు.

విషయంలో తాను వైసీపీ వ్యతిరేక ఓటును బయటకు పోనివ్వను అన్నారు. పవన్ మరో రోజు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అవుతారని అంటున్నారు.

Latest News