Janasena | యుద్ధానికి సేనాని సిద్ధమా.. నేడే జనసేన ఆవిర్భావ సభ..!

మచిలీపట్నానికి తరలి వస్తున్న క్యాడర్ విధాత‌: జనసేన (Janasena) పదో వార్షికోత్సవం 14న మచిలీపట్నం (Machilipatnam)లో జరగబోతోంది. దీనికి పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు సభకు వస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సభకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు అంశాలమీద.. పొత్తులు వంటి విషయాలను క్లారిఫై చేస్తారని క్యాడర్ ఎదురు చూస్తోంది. పార్టీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ కనిపిస్తోంది. అందులో […]

  • Publish Date - March 14, 2023 / 07:02 AM IST

  • మచిలీపట్నానికి తరలి వస్తున్న క్యాడర్

విధాత‌: జనసేన (Janasena) పదో వార్షికోత్సవం 14న మచిలీపట్నం (Machilipatnam)లో జరగబోతోంది. దీనికి పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు సభకు వస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సభకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు అంశాలమీద.. పొత్తులు వంటి విషయాలను క్లారిఫై చేస్తారని క్యాడర్ ఎదురు చూస్తోంది.

పార్టీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ కనిపిస్తోంది. అందులో ‘యుద్ధానికి నేను సిద్ధం… మీరు సిద్ధమా ‘ అని పవన్ చెబుతున్నట్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే బహిరంగసభలో పవన్ ఏమి మాట్లాడతారోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఇక ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.

జగన్ జన్మలో సీఎం కాలేరు..ఇది శాసనం అని గతంలో పవన్ గట్టిగా అన్నారు కానీ జగన్ విజయాన్ని ఆపలేకపోయారు. దానికితోడు పవన్ ను జగన్ ఏనాడూ రాజకీయనాయకుడిగా చూడలేదు. కనీసం ఆయన పేరు కూడా ఉచ్చరించడం జగన్‌కు ఇష్టం ఉండదు. ఒక సినిమా యాక్టర్ అని సంభోదిస్తూ పవన్‌ను జగన్ విమర్శిస్తుంటారు. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే సరేసరి.. ప్యాకేజి కళ్యాణ్ అంటూ నిత్యం ర్యాగింగ్ చేస్తూనే ఉంటుంది.

ఇక పార్టీ పెట్టి పదేళ్లయినా జిల్లా కమిటీలు లేకుండా పార్టీని నడపడం పవన్ ప్రత్యేకత అన్నట్లు మారింది. ఇక ఆయన రోజుకో మాట మాట్లాడుతూ ఇతర పార్టీల్లోనే కాదు జనాల్లో కూడా పవన్ అయోమయం పెంచేస్తున్నారు. ఒకసారి టీడీపీ (TDP)తో పొత్తుకు రెడీ అంటారు. మరో రోజు తనకు ఎవరితోను పొత్తు లేదంటారు. మరోసారి నరేంద్ర మోడీకి (Narendra Modi) తన పూర్తి మద్దతు పలుకుతారు. ఇలాంటి మాటలతోనే పవన్లోని రాజకీయ అపరిపక్వత బయటపడుతోంది.

ఆవిర్భావ సభలో ఇలాంటి వాటికి పవన్ ముగింపు పలకబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల విషయంలో క్లారిటి ఇస్తారనే అందరు అనుకుంటున్నారు. ఇపుడు కూడా పొత్తుల విషయంలో క్లారిటి ఇవ్వకపోతే నష్టపోయేది పవనే కాదు ఇతర పార్టీలు కూడా. పొత్తుల మీదే పోటీ చేయబోయే స్థానాల సంఖ్య నియోజకవర్గాలు ఏవన్న విషయం ఆధారపడుంది.దాన్ని బట్టి పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్ అవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ ఓ రూట్ మ్యాప్ ఇస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు.

Latest News