Site icon vidhaatha

Pawan Varahi | వారాహి వచ్చినాదో.. జూన్ 14 నుంచి పవన్ జిల్లాల టూర్లు

Pawan Varahi

విధాత‌: మొత్తానికి అభిమానులు, కార్యకర్తల ఎదురుచూపులు, రాజకీయ ప్రత్యర్థుల వెక్కిరింపులు, ఎత్తిపొడుపులకు ముగింపు పలుకుతూ జనసేనాని ప్రజల్లోకి వస్తున్నారు. జూన్ 14 నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఆరేడు నెలల క్రిందటే పవన్ కళ్యాణ్ వారాహి పేరిట ప్రచార రథాన్ని తయారు చేయించి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు కూడా చేయించారు. అయితే ఆ తరువాత దాన్ని బయటకు తీసుకురాలేదు.

ఇంకా టిడిపితో సీట్ల సర్దుబాటు సైతం ఫైనల్ కాకపోవడం, హరిహర వీరమల్లు వంటి సినిమాల్లో బిజీగా ఉండడంతో పవన్ ఆ వాహనాన్ని బయటకు తీయలేదు. దీంతో ఇటు వైసిపి సోషల్ మీడియా ఆ వాహనం మీద సెటైర్లు మొదలు పెట్టింది. ఏదిఏమైనా గానీ ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగిస్తూ పవన్ జూన్ 14 నుంచి అన్నవరంలో పూజల అనంతరం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలలకు వెళ్తారు.

ప్రతి నియోజకవర్గంలో రెండ్రోజులు ఉండేలా టూర్ ప్లాన్ చేస్తున్నారు. దాంతోబాటు ఒక ఫీల్డ్ విజిట్ అంటే వృత్తి దారులు, రైతులు, కర్షకులు , కూలీలు, ఇలా వివిధ వర్గాల వారిని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. తమ బలం అంతా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే కాబట్టి అక్కడే, కాపుల మద్దతు కోసం తొలుత అదే జిల్లాల్లో పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసారు. పోన్లే ,, లేటుగా అయినా లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నారు అని జనసైనికులు సంబరపడుతున్నారు.

Exit mobile version