Site icon vidhaatha

Philippines | భార‌త్ నుంచి బియ్యం దిగుమ‌తి.. ఫిలిప్పీన్స్ చ‌ర్చ‌లు

Philippines |

విధాత‌: పిలిప్పీన్స్ వియ‌త్నాం, భార‌త్‌ల నుంచి బియ్యం దిగుమ‌తి చేసుకునే విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు అక్క‌డి వ్య‌వ‌సాయ అధికారి ఒక‌రు చెప్పారు. త‌క్కువ ధ‌ర‌ల్లో కొనుగోలు చేసి నిల్వ‌లు పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఈ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

వియ‌త్నాం ఎగుమ‌తిదారులు క్వింటాలు 40 డాల‌ర్ల చొప్పున ఇవ్వ‌డానికి అంగీక‌రించార‌ని వ్య‌వ‌సాయ శాఖ స‌హ అధికారి డొమింగో పంగ‌నిబ‌న్ చెప్పారు.

ఈ చ‌ర్చ‌లు ఫ‌లిస్తే ఈ ఏడాది మూడు ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల నుంచి ఐదు ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌ర‌కు దిగుమ‌తి చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంని ఆ అధికారి తెలిపారు.

ఇప్పుడున్న బియ్యం నిల్వ‌లు 52 నుంచి 57 రోజుల వ‌ర‌కు స‌రిపోతాయ‌ని ఇప్ప‌టికిప్పుడు ఎటువంటి ఇబ్బంది లేద‌ని చెప్పారు. ఎల్‌నినో నేప‌థ్యంలో బియ్యం కొర‌త ఏర్ప‌డ‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ఫిలిప్పీన్స్ చెబుతున్న‌ది.

Exit mobile version