Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న ప్రభాకర్ రావు ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేసింది. మరో వైపు ఇంటర్ పోల్ ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సిట్ పోలీసులు. ఇప్పటికే జూన్ 20లోగా కోర్టులో హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. లేనట్లయితే అప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని..ఆస్తుల సీజ్ కు అనుమతిస్తామని స్పష్టం చేసింది.